Mirai: Theja Sajja’s Another Super hero Movie After Hanuman:
Table of Contents
- తేజ సజ్జా హీరోగా రూపొందుతున్న ‘మిరాయ్’
- ‘సూపర్ యోధ’గా కనిపించనున్న హీరో
- దర్శకత్వం వహిస్తున్న కార్తీక్ ఘట్టమనేని
- సంగీతాన్ని సమకూర్చుతున్న గౌర హరి
- 2025 ఏప్రిల్ 18న 7 భాషల్లో విడుదల
తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్ లో చిత్రం:
తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘మిరాయ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. గ్లింప్స్‌లోని విజువల్స్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశాయి. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాల స్థాయికి తగ్గట్టే విజువల్స్ కనిపించాయి. అయితే ఇది 20 రోజుల్లో తీసిన ఫుటేజ్.
‘హనుమాన్’ చిత్రంలో సూపర్ హీరోగా కనిపించిన యంగ్ హీరో తేజ సజ్జా:
‘హనుమాన్’ చిత్రంలో సూపర్ హీరోగా కనిపించిన యంగ్ హీరో తేజ సజ్జామరోసారి అదే తరహా పాత్రలో కనిపించేందుకు రెడీ అవుతున్నారు. ‘హనుమాన్’ సమయంలోనే `మిరాయ్` సెట్స్‌పైకి వెళ్లింది. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. అయితే ఆ తరవాత తేజా సజ్జా `హనుమాన్`పై ఫోకస్ చేయడంతో ‘మిరాయ్’ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. అది మంచికే అయ్యింది. `హనుమాన్` భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో ‘మిరాయ్’ లెక్కలు మారిపోయాయి. కావల్సినంత బడ్జెట్ కేటాయించుకొనే వెసులు బాటు వచ్చింది. దానికి తగ్గట్టే.. స్టార్ కాస్ట్ కూడా మారింది. మంచు విష్ణు, దుల్కర్ సల్మాన్‌లాంటి వాళ్లు టీమ్ లో చేరారు. త్వరలోనే ‘మిరాయ్’ కొత్త షెడ్యూల్ మొదలు కానుంది.
కళింగ యుద్ధంతో ముడిపడి నడిచే కథ:
ఈ కథ కళింగ యుద్ధంతో ముడిపడి నడిచేదిగా కనిపిస్తోంది. కళింగ యుద్ధం అనంతరం, పవిత్రమైనవిగా .. ప్రాచీనమైనవిగా చెప్పబడే 9 గ్రంథాలను కాపాడవలసిన బాధ్యత 9 మంది యోధులపై ఉంటుంది. ఆ గ్రంథాలకు ఏ వైపు నుంచి ఆపద ముంచుకొస్తుంది? అప్పుడు యోధుడైన హీరో ఏం చేస్తాడు? అనేదే కథ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా, 3Dలోను విడుదల కానుండటం విశేషం.
సూపర్ యోధగా తేజ సజ్జా:
ప్రాచీన యుద్ధ విద్యలు తెలిసిన వ్యక్తిగా, డిఫరెంట్ లుక్ తో ఈ పోస్టర్లో హీరో కనిపిస్తున్నాడు. అతణ్ణి ఒక ‘సూపర్ యోధ’గానే పరిచయం చేశారు. ‘హను మాన్’ కి సంగీతాన్ని అందించిన గౌర హరినే ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Mirai: Theja Sajja’s Another Superhero Movie After Hanuman:
also read :
war2 teamని ఆశ్చర్యానికి గురి చేస్తున్న NTR