mediaposter.in

Deenamma Jeevitham Movie Review : దీనమ్మ జీవితం సమీక్ష

Deenamma Jeevitham Movie Review: దీనమ్మ జీవితం ఎలా ఉందంటే..

Movie Name: దీనమ్మ జీవితం

Producer: వై. మురళి కృష్ణ, వై. వెంకటలక్ష్మి, డి. దివ్య సంతోషి, బి. సోనియా

Director: మురళి రామస్వామి

Editor:జానీ బాష

Music Director:ఆర్ ఎస్

Casting: దేవ్, ప్రియ చౌహాన్, సరిత..తదితరులు

Plot:

క్రిష్ అలియాస్ కృష్ణ (దేవ్ బల్లాని)కి సినిమాలంటే అంతులేని ప్రేమ. అతని పెద్ద కల ఒక గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకోవడం. కానీ, అతని భార్య రాధ (ప్రియా చౌహాన్) మరియు కూతురి గురించి పట్టించుకోకుండా, అతడు సిల్వర్ స్క్రీన్ మీద డైరెక్షన్ ఛాన్స్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటాడు . ఈ ప్రయత్నాల్లోనే మహిమ అలియాస్ మహి (సరిత చౌహాన్) పరిచయం ఏర్పడి ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పడుతుంది. మహిమ మాయలో పడిపోయి, క్రిష్ తరచూ తన భార్యతో గొడవ పడుతుంటాడు. ఈ క్రమంలో అతని కెరీర్ కూడా సరైన పలితాలు ఇవ్వకపోవటంతో , అతని జీవితం ఒక గందరగోళంగా మారిపోతుంది.

తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న రాధ, అతనిని దారికి తెచ్చి కుటుంబాన్ని చక్కదిద్దు కోవాలని  ప్రయత్నిస్తుంది. క్రిష్ కూడా తన తప్పు తెలుసుకుని, మహిని వదిలి కుటుంబంతో గడపాలని నిర్ణయిస్తాడు. కానీ మహి మాత్రం క్రిష్‌ను విడిచిపెట్టడానికి ఇష్టపడదు. మరి, మహిని వదిలించేందుకు క్రిష్ ఏం చేశాడు? క్రిష్‌కు మహి ఎలా పరిచయం అయింది? రాధ అతన్ని ఎలా కాపాడుకుంది? చివరకు క్రిష్ తన లక్ష్యాన్ని చేరుకోగలిగాడా లేదా? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

నటి నటుల పనితీరు:

క్రిష్ పాత్రలో దేవ్ బల్లాని నటన ఆకట్టుకుంది. మహి పాత్రలో సరిత చౌహాన్ బోల్డ్‌గా కనిపించింది. రాధ పాత్రలో ప్రియా చౌహాన్ తన పాత్రకు న్యాయం చేసింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సినిమాటోగ్రఫీ, సంగీతం, నిర్మాణ విలువలు బాగున్నాయి, ఐటెం సాంగ్ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది

Deenamma Jeevitham Movie Review:

అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రవేశిస్తే పచ్చటి సంసారం లో  కలిగే మార్పులు ఎలా ఉంటాయి? ముఖ్యంగా కెరీర్‌పై దాని ప్రభావం ఎంత ఉంటుంది? అనే  స్టొరీ లైన్ తో  ఈ చిత్రం రూపొందించబడింది. కామెడీగా సాగినప్పటికీ, సినిమాలో ఒక గొప్ప  సందేశం ఉంది. క్షణిక సుఖం కోసం వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల జీవితం ముఖ్యంగా కాపురాలు ఎలా తారుమారు అవుతయో  దర్శకుడు మురళి స్వామి ఎంతో భావోద్వేగంతో చూపించాడు. ఫస్టాఫ్‌లో బోల్డ్ సీన్స్, సెకండ్ హాఫ్‌లో భావోద్వేగాలు మిళితమై ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తాయి. కొన్ని సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు.

 

విరాజి మూవీ సమీక్ష: అప్పుడే ఓటీటీలోకి వరుణ్ సందేశ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ

Grrr review: గర్‌ర్‌ర్ మూవీ రివ్యూ

శేఖర్ హొమ్ (2024) వెబ్ సిరీస్ సమీక్ష (రివ్యూ)

Leave a Comment