Karthika Deepam June 17th episode:
కార్తీకదీపం 2 సీరియల్ – జూన్ 17 ఎపిసోడ్:
ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. కార్తీక్ ముందు జ్యోత్స్న ఓపెన్ అయిపోతుంది. తన మనసులో ఉన్న ప్రేమను మొత్తం బయట పెడుతుంది. “ఐ లవ్ యూ బావ” అంటూ తన ప్రేమని వ్యక్తపరుస్తుంది. దీప, కార్తీక్‌తో “నీకు ఏమైంది జ్యోత్స్న?” అని అడిగితే, జ్యోత్స్న “మా బావకు ఎంతో ఇష్టమైన టీ ఇవ్వమని అడుగుతుంది. కానీ ఇప్పుడు కాదు, తర్వాత వస్తాను. స్కూల్‌లో మా బావ పేరుకు బదులు నా పేరు ఇచ్చినట్టే నీ బాగోగులు చూసుకోవడానికి నేనే ఇక నుంచి వస్తాను. నేను కార్తీక్ భార్యను కాబోయే భార్యను” అని చెబుతుంది. దీప, కార్తీక్ అనుకుంటారు జ్యోత్స్న బుర్ర పాడుచేసిందని.
దీప “నా బాగోగులు చూడటానికి ఎవరూ రావవసరం లేదు” అంటుంది. “కడియం వస్తే నేను మీ కార్తీక్ బాబుకి మరదలు మాత్రమే కాదు భార్యను కాబోయే భార్యను” అని గుర్తు పెట్టుకోమని చెప్తుంది.
జ్యోత్స్న అనుమానాలు తీరిపోవాలంటే కార్తీక్ బాబుతో జ్యోత్స్న పెళ్లి కావాలని దీప అనుకుంటుంది. శ్రీధర్ మీద స్వప్న అలుగుతుంది. “కూతురు హాస్పిటల్‌లో జాయిన్ అయినా కూడా నువ్వు రాలేదు. రెండు రోజులు మాతో ఉండమన్నా కూడా కుదరదని అన్నావ్. ఈసారి ఎప్పుడు వస్తావ్?” అని కోపంగా అంటుంది. స్వప్న తన తండ్రి మీద అలిగి “నాకు మీరు తప్ప వేరే లోకం లేదు.
డాడీ రాలేకపోతున్నందుకు అర్థం చేసుకోవాలి. బిజినెస్‌లో లాస్ వచ్చింది. ఓడిపోయిన వ్యక్తిగా మీ నాన్న ఉండాలని అనుకుంటున్నావా?” అంటే “లేదు మా నాన్న ఎప్పుడూ విన్నర్‌గా ఉండాలి. మనకు ఎవరు ఉన్నారు? మనం ముగ్గురం కలిసి ఉండాలి కదా” అంటుంది. “మన లిస్ట్‌లో ఇంకొకరు కూడా ఉన్నారు, అది ఎవరో కాదు, నన్ను సేవ చేసిన బాస్” అంటుంది. “బాస్‌కు ఒక్కసారి కనెక్ట్ అయితే చాలు, వాళ్ళు రిలేటివ్ అవాల్సిందేనని” చెప్తుంది. “బాస్‌కి ఫోన్ చేసి నువ్వు థాంక్స్ చెప్పాల్సిందేనని” ఫోన్ చేయబోతే శ్రీధర్ ఆపుతాడు. “కొత్త వాళ్ళతో స్నేహం చేయడం మంచిది కాదని” చెప్తాడు. “ఏదో ఒకరోజు బాస్‌ని తీసుకొచ్చి డాడీని సర్‌ప్రైజ్ చేస్తానని” అంటుంది. “ఏమైంది జ్యోత్స్న, నీకు బాగానే ఉండే దానివి కదా, ఎందుకు ఇలా తయారయ్యావ్? నువ్వే మాట్లాడుతున్నావా? లేదంటే నీతో ఇంకెవరైనా మాట్లాడిస్తున్నారా?” అని నిలదీస్తాడు.
దీప, అమాయకురాలు, రెస్టారెంట్‌కి వెళ్దామని చెప్పిన వాడివి స్కూల్‌కి ఎందుకు వెళ్ళావని ఎదురుప్రశ్నిస్తుంది. “శౌర్య ఫోన్ చేసి భయంగా ఉందని అంటే వెళ్ళాను. రేపు మనకు పెళ్లి అయి హనీమూన్‌లో ఉన్నప్పుడు శౌర్య ఫోన్ చేస్తే వెళ్లిపోతావా?” అంటుంది. “అన్ని పరిస్థితులు ఒకేలా ఉండవని” చెప్తాడు. “నువ్వు దీప మీద ఏ కన్సన్ లేదా?” అంటే “ఉందని” చెప్తాడు. “నమ్ముకున్న వాళ్ళు అందరూ అన్యాయం చేశారు, కానీ భయపడకుండా తనకోక దారి వెతుక్కుంది. తనతో పాటు కూతురిని పనిలో పెట్టుకోకుండా తనని చదివించాలని అనుకుంది. అందుకే నువ్వు జాయిన్ చేసి డబ్బులు కట్టావ్ కదా?” అంటుంది.
“నేను డబ్బులు కట్టాను కానీ దీప ఫ్రీగా తీసుకోలేదు. నా కూతురు ఫీజు నేనే కట్టుకుంటాను” అంది. “అన్నీ ఒకేసారి ఇవ్వలేదు కాబట్టి ఒక డబ్బా పెట్టి అందులో నెలనెలా డబ్బులు వేస్తుంది. నేను ఫోన్ శౌర్య కోసం కొన్నాను. కానీ అది కూడా దీప ఫ్రీగా తీసుకోలేదు. నా దగ్గర కొనుక్కుంది. దీప డబ్బులు లేని మనిషి కానీ క్యారెక్టర్ లేని మనిషి కాదు. మోసం చేసే మనుషుల మధ్య బతుకుతున్న ఒక అమాయకురాలు. అందుకే తన మీద నాకు కన్సన్” అని కార్తీక్ చెప్తాడు.
జ్యోత్స్న “ఐ లవ్ యూ బావ” అని అంటుంది. “మరి అదే కన్సన్ నా మీద ఎందుకు లేదని” నిలదీస్తుంది. “నీకేమైంది, నువ్వు గోల్డెన్ స్పూన్‌తో పుట్టావని” అంటాడు. “పేరెంట్స్ మీటింగ్‌కి వెళ్ళినప్పుడు కనీసం నాకు ఒక మెసేజ్ చేయాలని తెలియదా? నువ్వు అలా చేయలేదని నేను బాధపడ్డాను. నీ గురించి నరసింహ అన్న మాటలు నా మైండ్‌లో తిరుగుతూనే ఉన్నాయి.
నువ్వు ఇప్పుడు సాయం జాలి పేరుతో తన చుట్టూ తిరిగితే వాడు ఏమనుకుంటాడని?” అంటుంది. “ఎవరో ఏదో అనుకుంటున్నారో కాదు, నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు” అని అడుగుతాడు. “ఐ లవ్ యూ బావ, మనసుతో ఆలోచిస్తే నీమీద నాకున్న ఫీలింగ్ ఇదే. అక్కడ నీకు తప్ప వేరే ఆలోచనకు చోటు లేదు. నా మనసులో నీకు తప్ప నాకు కూడా చోటు లేదు. నాది ప్రేమ కాదు, అలాగని ఆరాధన కాదు. ప్రేమించుకోవడానికి ఇద్దరు మనుషులు ఉండాలి. కానీ నువ్వు నేను ఒక్కటే అనుకుంటాను. మన ఇద్దరిది ఒకటే భావం. ఐ లవ్ యూ బావ, నేను నిన్ను ప్రేమించినా, నన్ను నేను ప్రేమించుకున్నా రెండూ ఒకటే” అంటుంది.
జ్యోత్స్న “నా ప్రేమను నీకు లైవ్‌లో ప్రూవ్ చేయాలంటే, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పు. నేను వెంటనే రోడ్డు మీద వస్తున్న కారు కింద పడి చచ్చిపోతానని” వెళ్లబోతుంటే కార్తీక్ ఆపుతాడు. “నా లైఫ్ నువ్వే అనుకున్నప్పుడు, అందులో నువ్వు ఉండను అన్నప్పుడు, ఇక నేను ఎందుకు బతికి ఉండటం?” అంటుంది.
ఇప్పుడు జ్యోత్స్నతో ఏం మాట్లాడకూడదని అనుకుంటాడు. “నీకు శౌర్య మీద కన్సన్ ఉంది, దీప మీద కన్సన్ ఉంది. శౌర్య వల్ల దీప మీద కన్సన్ వచ్చిందా? లేదంటే దీప మీద కన్సన్ తో శౌర్య దగ్గరకు వెళ్తున్నావా?” అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. “నేను ఏం చేసినా అది రౌడీ కోసమే. అది కార్తీక్ కార్తీక్” అంటూ అమాయకంగా మాట్లాడుతుంది. “నేను దీపతో మాట్లాడినా, తన దగ్గరకు వెళ్ళినా అన్నీ రౌడీ గురించే” అని చెప్తాడు.
అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
Karthika Deepam June 17th episode: