mediaposter.in

thalaivar 171 movie title starring rajinikanth|రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ మూవీ టైటిల్ “కూలి”

Thalaivar 171 movie title starring rajinikanth:

“లోకి సినిమాటిక్ యూనివర్స్” తో చాలా ఫేమస్ అయిన తమిళ యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇటీవల తీసిన లియో సినిమాతో కాస్త వెనకబడ్డాడు. అతను తీసిన లియో సినిమా అంచనాలను అందుకోకుండా అతని పంతాలో సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను కాస్త నీరుత్సాహపరిచిందని చెప్పాలి. కానీ ఏమాత్రం నిరుత్సాహపడకుండా తన నెక్స్ట్ మూవీ ని సూపర్ స్టార్ రజినీకాంత్ తో  ప్లాన్ చేశాడు.

తాను ప్రతి సినిమాకి ముందుగా రిలీజ్ చేసే స్నీక్ పీక్ లాగే సూపర్ స్టార్ రజినీకాంత్ తో తీసే తన 171 చిత్రాన్ని ఈరోజు యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో రజినీకాంత్ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ప్రకటించాడు. ఈ మూవీకి “కూలీ” అనే టైటిల్‌ను పెట్టాడు లోకేష్ కనకరాజ్.

thalaivar 171 movie title starring rajinikanth
Tthalaivar 171 movie title starring rajinikanth

ముఖ్యాంశాలు:

  • తలైవార్ 171 అప్డేట్ ఇదే.
  • కూలీగా కనిపించనున్న రజినీ
  • బంగారం మాఫియాపై మూవీ?

రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ మూవీ టైటిల్ కూలి:

తలైవార్ 171 అనే హష్ ట్యాగ్  తో ట్రెండ్ అయిన ఈ చిత్రం సిని ప్రేమికులను ఎంతో ఆసక్తికి గురి చేసింది

ఈసారి లోకేష్ కనగరాజ రజనీకాంత్ తో చేసే ఈ చిత్రానికి కొంచెం వెరైటీ  టైటిల్ ఫిక్స్ చేశారు కనకరాజ్ మూవీ అనౌన్స్ మెంట్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. సినిమా కాన్సెప్ట్‌ను చూపించేలా ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను ముందుగానే షూట్ చేశాడు. విక్రమ్, లియో టైంలోనూ ఇలానే చేశాడు. ఇప్పుడు కూడా ఈ కూలీ మూవీ కాన్సెప్ట్ తెలిసేలా, అర్థమయ్యేలా ఓ వీడియోను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. బంగారం అక్రమ రవాణా మీద సూపర్ స్టార్ రజినీకాంత్ చేసే పోరాటమే ఈ కూలీ అన్నట్టుగా కనిపిస్తోంది.

జైలర్ మూవీ తో ఉన్న సూపర్ స్టార్ రజినీ కాంత్ తన తదుపరిచిత్రాన్ని లోకేష్ కనగరాజు తో అనౌన్సు చేయటం తో అభిమానులంత చాల సంతోష పడ్డారు.ఖైదీ, విక్రమ్ మరియు మాస్టర్. సినిమాలతోఎంతో ప్రఖ్యాతి సాధించిన లోకేష్ కనగరాజ్  తాను ఇటీవల తీసిన లియో సినిమాతో కొంచం వ్యతిరేకతను కూడగట్టుకున్నాడు.

‘కూలీ’గా రజినీకాంత్.. బంగారంపై లోకేష్ మూవీ?

కూలీ మూవీ వీడియోను సన్ పిక్చర్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో వదిలింది. ఈ వీడియోలో రజినీ ఎంట్రీ, డైలాగ్స్, యాక్షన్, మ్యానరిజం, చివర్లో ఆ వికటాట్టహాసం అదిరిపోయాయి. ఇక అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ మరింత ఎఫెక్టివ్‌గా అనిపించింది. ఇక ఈ వీడియోని చూస్తుంటే ఇందులో బంగారం మెయిన్ కాన్సెప్ట్‌లా కనిపిస్తోంది. ఇది వరకు లోకేష్ డ్రగ్స్ మీద పడ్డాడు. ఇక ఈ మూవీలో గోల్డ్ స్మగ్లింగ్‌ను చూపించేలా ఉన్నాడు. వీటన్నంటినీ చివరకు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఎలా కలుపుతాడో చూడాలి.

కింగ్ నాగార్జున లీడ్ రోల్:

ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయబడుతున్న ఈ కూలి సినిమాలో  టాలీవుడ్ నవ మన్మధుడు కింగ్ నాగార్జున ఒక లీడ్ రోల్ ను  చేయబోతున్నట్టు సమాచారం.రెండు రోజుల కిందట లోకేష్ కనగరాజ్ హైదరాబాద్‌కు వచ్చి తన పాత్రను నాగార్జునగారికి వినిపించడం జరిగింది. దీనికి ఎంతో ఎక్సైట్ అయిన నాగార్జున వెంటనే ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఇటీవల సంక్రాంతికి విడుదలైన నా సామిరంగా మూవీతో నాగార్జున మళ్లీ హిట్ ట్రాక్ తొక్కారు. దీంతో పాటు ధనుష్ హీరోగా చేస్తూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రంలోనూ నాగార్జున ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఇలా మల్టీస్టారర్ మూవీ లను నాగార్జున గారు చేయడం చాలా అభినందనీయం.

Leave a Comment